RARE PHOTOES
Friday, January 14, 2011
Wednesday, January 12, 2011
"యోగా" లో వ్యాసాలు
1.అంజలి ముద్ర ఒక చేతి ముద్ర మరియు యోగాసనం. ఇది భారతదేశం మరియు ఇతర ఆసియా దేశాల్లో పెద్దల్ని గౌరవసూచకంగా మరియు నమస్కారం గా ఉపయోగంలో ఉన్నది. ఇది వివిధ యోగాసనాలు లో సంక్షిప్తం చేయబడినది.
2.గోముఖాసనం పద్ధతి
దండాసనం లో కుర్చోవాలి.
ఎడమ కాలిని మడిచి కుడి కాలి క్రింద పిరదుల దగ్గర ఉంచాలి.
కుడి కాలిని ఎడమ కాలి మీదుగా ఎడమ పిరదుల దగ్గర ఉంచాలి.
కుడి చేతిని వెనుకకి మడిచి వీవు మీద ఉంచాలి.
ఎడమ చేతిని పైకి ఎత్తి వెనుక కి మడిచి వీవు మీదకి తీసుకురావాలి.
చేతులు రెండిటిని పఠం లో చూపిన విధంగా లాగి పట్టుకోవాలి.
నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి.
కొద్ది క్షణాలు ఇలా చేసిన తరువాత మెల్లగా ఆసనం నుండి బయటికి రావాలి.
3.చక్రాసనము పద్ధతి
మొదట వెల్లకిలా పడుకోవాలి.
తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి.
కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును గూడా ఆనించాలి.
దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
2.గోముఖాసనం పద్ధతి
దండాసనం లో కుర్చోవాలి.
ఎడమ కాలిని మడిచి కుడి కాలి క్రింద పిరదుల దగ్గర ఉంచాలి.
కుడి కాలిని ఎడమ కాలి మీదుగా ఎడమ పిరదుల దగ్గర ఉంచాలి.
కుడి చేతిని వెనుకకి మడిచి వీవు మీద ఉంచాలి.
ఎడమ చేతిని పైకి ఎత్తి వెనుక కి మడిచి వీవు మీదకి తీసుకురావాలి.
చేతులు రెండిటిని పఠం లో చూపిన విధంగా లాగి పట్టుకోవాలి.
నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి.
కొద్ది క్షణాలు ఇలా చేసిన తరువాత మెల్లగా ఆసనం నుండి బయటికి రావాలి.
3.చక్రాసనము పద్ధతి
మొదట వెల్లకిలా పడుకోవాలి.
తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి.
కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును గూడా ఆనించాలి.
దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
4.వజ్రాసనం చేయు పద్ధతి: తొలుత సుఖాసన స్థితిని పొందాలినిటారుగా కూర్చోవాలి.రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.
5.త్రికొణాసనం---గాలి వదులుతూ ఎడమవైపుకు వంగి, ఎడమ అరచేతిని ఎడమ పాదానికి వెనుకగా నేలపై ఉంచాలి. ఈ స్థితిలో ఎడమచేయి, తమ ఛాతీ, కుడి చేయి ఒకే రేఖలో భూమికి సమాంతరంగా ఉంచాలి. నెమ్మదిగా మీ దృష్టిని కుడిచేతివైపు ప్రస్తుతమున్న స్థితిలోనే అరనిమిషంనుండి ఒక నిమిషంవరకు దీర్ఘశ్వాసక్రియతో ఉండాలి. తర్వాత యధాస్థితికి చేరుకోవాలి. ఇదే రకంగా సమస్థితిలోకి వచ్చి కుడివైపు కూడా చేయాలి.
6.వృక్షాసనం--- చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి ఎడమ కాలును మోకాలు వద్ద వంచి ఎడమ మడిమను మూలస్థానం వద్ద ఉంచుతూ, పాదాన్ని కుడి తొడకు అదిమి పట్టి ఉంచాలి. పాదము భూమికి లంబంగా, వ్రేళ్ళు నేలపైవైపు ఉండాలి, చేతులు నడుముపైన ఉంచాలి. గాలి పీలుస్తూ కుడికాలిని సమంగా నిలిపి రెండు చేతులు ప్రక్కలకు లాగుతూ భూమికి సమాంతరంగా అర చేతులు నేల వైపు చూపాలి .
7.పద్మాసనం--నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు కాళ్లకు సంబంధించిన మోకాళ్లు తప్పని సరిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. మరింత ఒత్తిడికి గురిచేయకుండా వెన్నెముకను నిటారుగా ఉంచాలి. కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి.వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను నమస్కార స్థితిలోను లేదా ఒకదానిపై మరొక చేతిని కలిపి ఉంచే స్థితి లేదా అరచేయి భాగం పైకి కనపడేలా రెండు అరచేతులను ఒకదానిపై ఒకటి ఉండే స్థితి లేదా మోకాళ్లపై రెండు చేతులను విశ్రాంతి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు.. రెండు అరచేతులు పైకి కనపడేలా లేదా రెండు అరచేతులు కిందకు చూచేలా ఉంచవచ్చు లేదా మోకాళ్లపై చేతులు ఉంచి బొటనవేలితో చూపుడు వేలును తాకించి మిగిలిన వేళ్లను అలాగే నిటారుగా ఉంచాలి.
స్నెహం
చిరు పలుకుల మన పరిచయము
భావమై నా యదను తడిమి
కవితలా కలము కదిలి
మెఘమై నన్ను వీడి
వానలా నిన్ను చేరగా
చిగురించిన మన స్నెహం
శిసిరానికి తొలి కమలం
నా హ్రుదయానికి నవోదయం..
భావమై నా యదను తడిమి
కవితలా కలము కదిలి
మెఘమై నన్ను వీడి
వానలా నిన్ను చేరగా
చిగురించిన మన స్నెహం
శిసిరానికి తొలి కమలం
నా హ్రుదయానికి నవోదయం..
Subscribe to:
Posts (Atom)



